70వ డివిజన్ కార్పొరేటర్ సీటు కోసం దెందుకూరి మురళీకృష్ణరాజు దరఖాస్తు

1234

విజయవాడ ప్రతినిధి : పార్టీ కార్యక్రమాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న దెందుకూరి మురళీకృష్ణరాజు 70వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు.

1995 నుంచి 2026 వరకు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా కొనసాగుతున్నట్లు మురళీకృష్ణరాజు తెలిపారు. 31 డివిజన్ యూనిట్ ఇన్‌చార్జిగా, 46వ డివిజన్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు , ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధికార ప్రతినిధిగా వివిధ బాధ్యతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విజయవాడ ప్రభాస్ ఫ్యాన్స్  అధ్యక్షుడిగా పలుసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ,సంస్థాగత కార్యక్రమాలతో పాటు డివిజన్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు సేవలు అందించానని మురళీకృష్ణరాజు తెలిపారు. తనకు 70వ డివిజన్ కార్పొరేటర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా తనకు ఉన్న పరిచయాలు, ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని 70వ డివిజన్ కార్పొరేటర్ సీటు కేటాయించాలని ఆయన కోరారు.