రేపు విశాఖలో  జాబ్ మేళా

jobmela

14కంపెనీల ఆధ్వర్యంలో 700 ఉద్యోగాల భర్తీ

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు  వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న శుక్రవారం ఉదయం  9గంటలకు విశాఖలోని డాబాగార్డెన్స్ లో   రమాదేవి బానోజిరావు ప్రాధమిక పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.  ఈ మేరకు విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో మొత్తం 14 ప్రముఖ కంపెనీలు 700ఖాళీల భర్తీ చేయనున్నారు.. పది  నుంచి పీజీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు.  .ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, డిప్లమో, అభ్యర్థులకు ఏడాదికి రూ.1.8లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్యాకేజీలు అందుకునే అవకాశముందన్నారు. విశాఖ,అచ్చుతాపురం,శ్రీసిటీ,చెన్నై , విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో అభ్యర్థులు ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. తమ వెబ్‌సైట్‌లో పేర్లు దరఖాస్తు చేసుకుని, సంబంధిత అడ్మిట్ కార్డును మేళాకు తీసుకు రావాలని చాముండేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మేళా రోజే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుందని, మరిన్ని వివరాలకు 99487 68778, 9966965502, 87901 17279, 87126 55686 తదితర ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చన్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో పాటు  ఆధార్, ఫొటోలు, రెజ్యూమ్‌తో సహా అభ్యర్థులు హాజరు కావాలని కోరారు.