- జనసేన ప్రచార జోరు!
- 66వ డివిజన్లో విస్తృతంగా పర్యటన.. ప్రజలతో ఆత్మీయ పలకరింపులు
- డివిజన్ అభివృద్ధే ధ్యేయం
- మేయర్ అభ్యర్థి రాధాకృష్ణతో ప్రచారం
విజయవాడప్రతినిధి: 66వ విజన్‌లో జనసేన ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మట్లా రవీంద్ర విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా డివిజన్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆదరాభిమానాలను కోరుతున్నారు. సైకిల్, గాజు, కమలం గుర్తులతో కూడిన కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నేతలు సమష్టిగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఇంటింటి ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న మట్లా రవీంద్ర.. డివిజన్ అభివృద్ధిపై తనకున్న ఆలోచనలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వడమే తన లక్ష్యమని చెబుతున్నారు. కార్పొరేటర్‌గా తనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు.
ప్రజల ఆదరణతో డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విజయానికి కూడా మద్దతు పలకాలని కోరుతున్నారు. డివిజన్ అభివృద్ధితోపాటు నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మట్లా రవీంద్రకు మద్దతుగా ఓటర్లను కలుస్తున్నారు.
