ఏఐకూ ఒకే రకమైన ప్రమాణాలు అవసరం 

AIIII

లేదంటే భవిష్యత్తు నాశనం : వింటన్ సెర్ఫ్ సూచన

ఏఐ  వేగంగా స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ల దిశగా  అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ రూపకర్తల్లో ఒకరైన వింటన్ సెర్ఫ్ (Vinton Cerf) టెక్నాలజీ సంస్థలకు కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో ఏఐ విజయవంతం కావాలంటే గతంలో ఇంటర్నెట్ ఎలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందో దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు.

83 ఏళ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త వింటన్ సెర్ఫ్. ఆధునిక ఇంటర్నెట్‌కు పునాది అయిన నెట్‌వర్కింగ్ ప్రోటోకాల్స్‌ను రూపొందించిన వారిలో ఈయన  ఒకరు. ఓపెన్ ఫ్రాంటియర్స్   సదస్సులో కంప్యూటర్ శాస్త్రవేత్తలు, డేటాబ్రిక్స్   సహ వ్యవస్థాపకుడు  మతేయి జహారియా (Matei జాహరియా) తో కలిసి పాల్గొన్న ఆయన, ప్రస్తుతం ఏఐ కీలక పరిస్థితిలో ఉందన్నారు. 

ఇంటర్నెట్ ఎందుకు విజయవంతమైంది?

వింటన్ సెర్ఫ్ ప్రకారం ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రధాన కారణం అది వికేంద్రీకృత  వ్యవస్థగా రూపొందడమే. అలాగే అన్ని సంస్థలు ఒకే సాంకేతిక ప్రమాణాలను అనుసరించడం కూడా విజయానికి కారణమైంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు అన్నీ ఒకే సాంకేతిక భాషను ఉపయోగించడంతో ఇంటర్నెట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. 

 ప్రమాణాలు అవసరం

ప్రస్తుతం ఏఐ రంగం కూడా ఇదే దశలో ఉందని   ప్రతి సంస్థ తనదైన శైలిలో వేర్వేరు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుండటంతో భవిష్యత్తులో అవి ఒకదానితో ఒకటి సమర్థవంతంగా పనిచేయడం కష్టమవుతుందని  హెచ్చరించారు. అందుకే ఇప్పటి నుంచే ఇంటర్‌ఆపరబిలిటీ (Interoperability) అంటే వేర్వేరు ఏఐ వ్యవస్థలు పరస్పరం సమాచారాన్ని పంచుకుని కలిసి పనిచేసే సామర్థ్యం, అలాగే ప్రామాణిక సాంకేతిక ప్రమాణాలు  ఏర్పాటు చేయాలని సూచించారు.

ఏఐ ఏజెంట్లు ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవచ్చు

వింటన్ సెర్ఫ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యల్లో ఇది ఒకటి. మనుషులు ఏఐతో ఇంగ్లీష్ లేదా ఇతర సహజ భాషల్లో మాట్లాడటం సులభమే. కానీ ఒక ఏఐ ఏజెంట్ మరో ఏఐ ఏజెంట్‌తో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ వంటి సహజ భాషలు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇంగ్లీష్ వంటి భాషల్లో ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. ఈ అస్పష్టత వల్ల యంత్రాల మధ్య తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏఐ ఏజెంట్లు పరస్పరం మాట్లాడుకునేందుకు సందిగ్ధత లేని, అత్యంత ఖచ్చితమైన, ప్రామాణిక కమ్యూనికేషన్ విధానం అవసరమని  వివరించారు.

ఉత్పత్తిగా కాదు.. వేదికగా ఎదగాలి

ఏఐ కేవలం ఒక ఉత్పత్తిగా మిగిలిపోకూడదని, ఇంటర్నెట్‌లాగే అందరికీ ఉపయోగపడే  వేదికగా మారాలన్నారు.  ఇంటర్నెట్ అనే ఓపెన్ వేదికపై గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ సేవలను నిర్మించుకున్నట్లే, ఏఐ కూడా లక్షలాది మంది డెవలపర్లు తమ అవసరాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్లు, సేవలు రూపొందించుకునే పునాదిగా మారాలని ఆయన సూచించారు.