- 71వ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గార్లపాటి ఊర్మిళ ఇంటింటి ప్రచారం
- తనకు, జనసేన మేయర్ అభ్యర్థి రాధాకృష్ణకు రెండు ఓట్లు వేయాలని అభ్యర్థన
- అడుగడుగునా హారతులతో స్వాగతం
విజయవాడ ప్రతినిధి: విజయవాడ 71వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గార్లపాటి ఊర్మిళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను కలుస్తున్నారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రచారానికి వచ్చిన ఊర్మిళకు స్థానిక మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా ఊర్మిళ మాట్లాడుతూ.. 71వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా పనిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా అందించే నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటానని తెలిపారు.
ప్రజాసేవే లక్ష్యంగా.. డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా
ప్రజాసేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని, డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఊర్మిళ హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంలో ప్రజలకు వివరించారు. డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకుంటూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి
ఈ సందర్భంగా ఊర్మిళ తనకు, కూటమి బలపరిచిన జనసేన మేయర్ అభ్యర్థి రాధాకృష్ణకు మద్దతుగా ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ప్రతి కుటుంబం తనకు, మేయర్ అభ్యర్థికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంతోపాటు నగర అభివృద్ధికి కూడా ప్రాధాన్యమిస్తూ పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో 71వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి గార్లపాటి విజయకుమార్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
