అభివృద్ధే ఊర్మిళ లక్ష్యం

3456voormila voormika voormila (1)
  •  71వ డివిజన్‌కు కొత్త దిశ
  • సమస్యలపై ఆరా.. పరిష్కారాలపై భరోసా
  • ప్రజలతో మమేకమవుతూ ముందడుగు

విజయవాడప్రతినిధి: ఎన్నికల ప్రచారం అంటే ఓట్లు అడగడమే కాదు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవడం వారి సమస్యలను వినడం అభివృద్ధిపై భరోసా కల్పించడం. ఈ దిశగా 71వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గార్లపాటి ఊర్మిళ ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. డివిజన్‌కు కొత్త రూపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రజలను నేరుగా కలుస్తూ, స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు.

ఓట్ల అభ్యర్థనతో పాటు సమస్యలపై ఆరా!

డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఊర్మిళ.. ప్రతి గడపనూ పలకరిస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. ఆప్యాయ పలకరింపులతో ప్రజలకు చేరువవుతూ, వారి అవసరాలు, స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను శ్రద్ధగా వింటూ.. వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని భరోసా కల్పిస్తున్నారు. ప్రచారాన్ని కేవలం ఓట్ల అభ్యర్థనకే పరిమితం చేయకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే వేదికగా మలుచుకుంటున్నారు.

హామీలకు మించి అభివృద్ధి కార్యాచరణ!

డివిజన్ అభివృద్ధి విషయంలో ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ఉండాలని ఊర్మిళ పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే అంశాలపై దృష్టి సారిస్తానని చెబుతున్నారు. 71వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తానని వివరిస్తున్నారు.

కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి ప్రచారం

ప్రచారంలో భాగంగా జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు, తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఊర్మిళ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొంటూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలుస్తున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, డివిజన్ అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వివరిస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల సమస్యలే ప్రాధాన్యంగా  అభివృద్ధే లక్ష్యంగా 71వ డివిజన్‌కు కొత్త రూపు తీసుకురావాలనే సంకల్పంతో ఊర్మిళ ప్రచారం కొనసాగుతోంది.  టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్  గార్లపాటి విజయకుమార్ , ఇతర నేతలు పాల్గొన్నారు.