హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత
ప్రస్తుతం వీస్తున్న ఈదురు గాలుల ప్రభావంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని హంసలదీవి బీచ్ వద్ద అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి సముద్రం అల్లకల్లోలంగా మారింది..ఈ నేపద్యంలో శనివారం పాలకాయ తిప్ప కరకట్ట వద్ద బీచ్ గేట్లను మూసి వేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ వి కే కుమార్ తెలిపారు.
ఈ విషయాన్ని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు గమనించి బీచ్ వద్దకు రావద్దని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన అనంతరం మరల బీచ్ గేట్లు తెరవబడతాయన్నారు.
