గాజువాకలో భారీ అగ్నిప్రమాదం…

Untitled design (1)

కణితి రోడ్డులో శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో మంటలు…

అప్రమత్తమైన  అగ్నిమాపక సిబ్బంది … తప్పిన ముప్పు 

VISAKHAPATANAM: గాజువాకలోని శివ ఫైర్ వర్క్స్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దుకాణం నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.