ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్ 2026 టర్మ్ ఎండ్ పరీక్షలు జూన్ 1, 2026 నుండి జులై 21, 2026 వరకు జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయకేంద్రం రీజినల్ డైరెక్టర్ డా. కె. సుమలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ ప్రాంతీయకేంద్రం పరిధిలో 6 పరీక్షా కేంద్రాలను విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్ మరియు అనంతపురం లలో ఏర్పాటు చేసామన్నారు. అర్హులైన అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ ను ఇగ్నో వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచబడ్డాయని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్స్ ని ఇగ్నో విశ్వవిద్యాలయపు సమర్త్ స్టూడెంట్ పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబందించి అభ్యర్థులు తమతమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని డా. కె. సుమలత పేర్కొన్నారు. ఇతర వివరాలకు కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866-2565253 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు అని తెలియచేసారు.
జూన్ 1 నుండి ఇగ్నో పరీక్షలు ప్రారంభం
