ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు , ఉమ్మడి రాష్ట్ర మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి (85) మృతి పట్ల మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనియాడారు.. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిగణించారు.. గాదె వెంకటరెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు.
మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి దిగ్భ్రాంతి
