‘మా ఇంటి బంగారం’తో సమంతకు భారీ విజయం.. 

Smanta

– ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు

నటి సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ రిలీజ్ అయ్యి నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మరో మైలురాయిని అందుకుంది.

ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్  వీడియోను షేర్ చేసుకున్నారు . ఆ వీడియోలో డైరెక్టర్  రాజ్ నిడిమోరు ‘ఒక కూల్ విషయం చూపించాలి’ అంటూ సమంతకు ఐప్యాడ్ ఇచ్చారు . దాన్ని అన్‌లాక్ చేసి సినిమా ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.100 కోట్లకు చేరుకున్నాయని చూసిన సమంత తెగ సంతోష పడిపోయింది.

సినిమా విడుదలకు ముందు తనకు ఎదురైన విషయాలను షేర్ చేసుకున్నారు. ‘సినిమా గురించి ఆడియన్స్  మాట్లాడుతున్నారా?  ప్రజలకు ఈ మూవీ రీచ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ గురించి అసలు ఆడియన్స్ కి తెలుసా అన్న ఎన్నో   సందేహాలు తనను వెంటాడాయని తెలిపారు.

తన స్నేహితుడు  ఓ  ఎగ్జిబిటర్‌కు ఫోన్ చేసి ‘మా ఇంటి బంగారం’ గురించి అడిగిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ‘ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ  చూడటానికి ఎవరు వస్తారు? పెద్ద హీరో సినిమాల్లో ఉంటేనే ఆమెకు గుర్తింపు ఉంటుంది. గ్లామర్‌ నే ఆడియన్స్  చూస్తారు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని  ఎవరూ చూడరు’ అని ఆ ఎగ్జిబిటర్ చెప్పాడని సమంత వెల్లడించారు.

‘మా ఇంటి బంగారం’ విజయం అలాంటి అభిప్రాయాలను మార్చే తొలి అడుగు కావాలని సమంత ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నిజమైన మార్పు రావాలంటే ఎవరో ఒకరు సాహసం చేయాలి. చాలా సందర్భాల్లో ఆ సాహసం ఫలించదు. కానీ కొన్నిసార్లు మాత్రం విజయం సాధిస్తుంది. మా విషయంలో అదే జరిగింది. ఇకపై బీ లేదా సీ సెంటర్‌లోని ఎగ్జిబిటర్‌ను మహిళా ప్రధాన చిత్రాల గురించి అడిగితే వెంటనే ‘ఎవరూ చూడరు’ అనే సమాధానం కాకుండా, ‘చూద్దాం’ అనే సమాధానం రావాలని కోరుకుంటున్నాను. అదే ఈ విజయానికి అసలైన అర్థం’ అని సమంత పేర్కొన్నారు.