‘పెద్ది నా కెరీర్ లోనే ది బెస్ట్ ’ 

peddi

– రామ్‌చరణ్‌

ఇప్పుడు ఎక్కడ చూసినా  పెద్ది ఫీవర్ తో ఊగిపోతున్నారు జనాలు. ఈ నెల 4 న  ‘పెద్ది’ చిత్రం  విడుదల కానుంది.రామ్‌చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా డైరెక్టర్  బుచ్చిబాబు సానా తెరకెక్కించారు .  ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ మూవీ టీమ్ పాల్గొంది .

ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘పెద్ది నా జీవితంలోనే అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో పాత్ర  ఎంతో సంతృప్తి ఇచ్చింది. వ్యక్తిగతంగా  నాలో మార్పు తెచ్చింది . బుచ్చిబాబు ఈ కథను కథలా కాకుండా ఒక మనిషి జీవిత ప్రయాణంలా వివరించారు. ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత నాకు అంతగా నచ్చిన సినిమా ఇదే. అభిమానులు, ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేశాను’ అన్నారు.

హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం. తెలుగు నేలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని చెప్పారు. ఇక నటుడు జగ్గు భాయ్  మాట్లాడుతూ ‘ఎనిమిదేళ్ల తర్వాత నాకు ఇంత మంచి పాత్ర దక్కింది. అప్పలసూరి పాత్రను బుచ్చిబాబు అద్భుతంగా తీర్చిదిద్దారు’ అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘ఇది కేవలం కమర్షియల్ మూవీ  కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న  ఎమోషనల్ డ్రామా. ఒక ఆట మనిషికి గౌరవం, గుర్తింపును ఎలా తీసుకువస్తుందో చెప్పే కథ’ అన్నారు .ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడుఏఆర్ రెహమాన్  లైవ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్ , ఎంపీ కేశినేని చిన్ని నిర్మాతలు , చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు.