విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి  

ntr birth anniversary

విశాఖలో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .  బీచ్ రోడ్ లోని ఆయన విగ్రహానికి టీడీపీ నేతలు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాలలు వేసి అభిమానాన్ని  చాటుకున్నారు.

ఈసందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ  దేశ రాజకీయాలలో టిడిపి కీలక పాత్ర పోషిస్తుందన్నారు . అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన తరువాత మార్పు  మొదలైనదని తెలిపారు. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన ఎస్ హెచ్ జి గ్రూప్ లు మహిళల అభివృద్ధి లో కీలక పాత్ర పోసిస్తున్నాయని చెప్పారు . మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకువస్తే కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు .  అయితే  బిల్లు తో సంబంధం లేకుండా టీడీపీ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కలిపిస్తూ తీర్మానం చేసారని తెలిపారు .

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాయింట్స్ :

  • ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అన్న ఎన్టీఆర్.
  • మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
  • సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
  • విశ్వవిఖ్యాత నటసార్వభౌమ బిరుదును పొందారు.
  • ఎన్టీఆర్ 1982 లో టిడిపి పార్టీని స్థాపించారు.
  • 100 ఏళ్ళు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ను కుకటివేళ్ళతో ప్రకలించి విజయం సాధించారు.
  • సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదం తో ముందుకు వెళ్లారు.
  • ప్రజలు కు ఇచ్చిన ప్రతి మాట ను నిలబెట్టుకున్నారు.
  • మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు.
  • సీఎం చంద్రబాబు సారధ్యంలో ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది.
  • లోకేష్ కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు.
  • హైబ్రిడ్ విధానంలో మహానాడు దిగ్విజయంగా జరుగుతుంది.
  • టీడీపీ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేశారు.
  • ఎన్టిఆర్ ఆశయాలను, సిద్ధాంతలను ముందుకు తీసుకువెళ్తాము.

టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట్ పట్టాభి రామ్ పాయింట్స్ :

  • తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టిఆర్.
  • తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర.
  • ఎన్టిఆర్ పాలన లో అనేక మార్పులను తీసుకువచ్చారు.
  • ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తాం.

ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షులు చోడే వెంకట పట్టాభి రామ్, విశాఖ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, మాజీ వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ అక్రమాని విజయనిర్మల, జిల్లా నాయకులు బైరెడ్డి పోతం రెడ్డి, అనసూరి మధు, నక్క కనకరాజు, ఆళ్ల శ్రీనివాసరావు, ఎర్నాగుల జగదీష్, ఎస్ సతీష్ కుమార్, చెట్టుపల్లి గోపి, కొల్లి చిరంజీవి, ఏడుకొండలు కొల్లి, తాడి వేణుకుమారి, ఉరుకుటి పైడ్రాజు, నడిగట్ల శంకర్రావు, ఉసిరికాయల డిల్లి ఈశ్వరి, రామారావు పాల్గొన్నారు,