చిన్ననాటి స్నేహం.. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకేచోట

0

 నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒకేచోట

1983-84 విద్యా సంవత్సరంలో శ్రీనివాస బాలవిద్యాలయంలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఓ హోటల్‌లో ఆత్మీయంగా కలుసుకుని స్నేహబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత జరిగిన ఈ సమావేశం ఆనందోత్సాహాల మధ్య సాగింది.

చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలు, ఉపాధ్యాయులతో గడిపిన మధుర క్షణాలు, కలిసి చేసిన అల్లర్లు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఒకరితో ఒకరు గుర్తు చేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడినప్పటికీ, తమ మధ్య ఉన్న స్నేహం మాత్రం ఎప్పటికీ చెదరలేదని వారు పేర్కొన్నారు.

జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ, స్నేహితులతో గడిపిన ఈ సమయం ఎంతో విలువైనదని, ఇలాంటి కలయికలు పరస్పర అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో శత్రుజ్ఞ, సతీష్, రెడ్డి, పద్మజ, జానకిశేషు, లలిత, రాజగోపాల్ పాల్గొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం అందరూ కలిసి ఫోటోలు దిగారు .