- మెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు
- ఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు
- అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే
- విద్యాశాఖ కమిషనర్ ను కోరిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు
మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన పరీక్షల్లో అడుగడుగునా దగా కనిపిస్తోందని, ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడం, మెరిట్ లిస్ట్ మాయం చేయడం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఇవాళ మంగళగిరిలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల్ని సిబ్బంది అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అనంతరం కమిషనర్ ను కలిసినా ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో ప్రజాప్రతినిధులు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బయటపెట్టాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రశ్నాపత్రం తయారీలో భాగమైన ఓ కాంట్రాక్ట్ మెరిట్ లిస్ట్ లో టాప్ లో వచ్చాడు. అతన్ని మీరు ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి. అసలు డీఎస్సీ మెరిట్ లిస్ట్ ప్రచురించకపోవడంలో ఆంతర్యం ఏంటి ? ఈ ప్రశ్నలకు విద్యామంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు .
అధికారులు అకర్మాల్ని సమర్ధించుకుంటున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు . డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరేందుకు విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం. అయితే ఆమె మేము చెప్పిన ఏ విషయాన్నీ ఆమె అంగీకరించకపోగా సమర్దించుకునే ప్రయత్నం చేశారాణి ఆయన చెప్పారు .
డీఎస్సీ ఉద్యోగాల్ని ఎమ్మెల్యేలు అమ్ముకున్నారని ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోసం అధికారుల్ని కలుద్దామని వచ్చాం. కానీ అధికారులు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. విద్యామంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి లేదా ఆయన్ను సీఎం చంద్రబాబు బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు .
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు . డీఎస్సీ కానీ, మరేదైనా పోటీ పరీక్ష జరిగితే మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలు వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం ముందే విజేతల్ని ఎంపిక చేసుకుని పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపించుకున్నారు. మెరిట్ లిస్ట్ బయటపెట్టకపోవడమే ఈ అనుమానాలకు కారణంమని ఆయన చెప్పారు .
తప్పు చేశారు కాబట్టే తప్పించుకుంటున్నారంటూ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సూట్ కేసుల పరిపాలన లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నీరో చక్రవర్తి తరహాలో రాష్ట్రంలో విద్యార్ధులు, నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే నారా చక్రవర్తులు మహానాడులో ఫిడేల్ వాయించుకుంటున్నారు. ఇధి మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ. అంటూ అయన విమర్శలు గుప్పించారు .
కష్టపడి చదివిన వారికి ర్యాంకులేవీ ? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి . డీఎస్సీలో అక్రమాలపై వినతిపత్రం కమిషనర్ కు ఇచ్చి సీబీఐ దర్యాప్తు కోరడమే మా ఉద్దేశం. కానీ జాయింట్ డైరెక్టర్ మాతో మాట్లాడకుండా మీడియాతో మాట్లాడుతున్నాడని ఆయన పేర్కొన్నారు .
అనుమానాస్పదంగా అధికారుల తీరు ఉందని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి చెప్పారు . డీఎస్సీలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేయించాలని కోరాం. ఎస్సీఈఆర్టీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎన్వోసీ ఇవ్వాలని చెప్పామని, కానీ అతను ఇవ్వలేదని అధికారులు చెప్తున్నారు. సర్టిఫికెట్ల ధృవీకరణ కోసం మీరు అతనికి కాల్ చేశారా లేక మెసేజ్ ఇచ్చారా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు .
