vijayawada: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) భాగస్వామ్యం అయింది. మంగళవారం నాడు భవానిపురంలోని బెరం పార్క్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మి షా పిలుపుమేరకు ఏపీయూడబ్ల్యూజే, అనుబంధ సంఘాలైన విజయవాడ ప్రెస్ క్లబ్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికల సంఘం, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున యోగేంద్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు .
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే, దాని అనుబంధ సంఘాలు భాగస్వాములు అవుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని చేపట్టే కార్యక్రమాలకు ఏపీయూడబ్ల్యూజే, అనుబంధ సంఘాలు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తూ భాగస్వాములు అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి యోగ సాధన ఎంతో ఉపకరిస్తుందని అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు .నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ రకరకాల ఆందోళనలతో వృత్తి జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టులకు యోగ సాధన అత్యుత్తమమైన రిలీఫ్ గా పని చేస్తుందని సూచించారు .
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే, అనుబంధ సంఘాలను కూడా భాగస్వామ్యం చేయటం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా కు కృతజ్ఞతలు తెలిపారు .యోగాంద్ర కార్యక్రమాలే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక ప్రజాహిత ,సంక్షేమ కార్యక్రమాలను ఏపీడబ్ల్యూజే అనుబంధ సంఘాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ముందు వరుసలో ఉంటున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులు సురేష్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు
