వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరంమని విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా మూడో వారానికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం న్యూ ఆర్టీసీ కాలనీ, జేడీ నగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం నగర పరిశుభ్రతకు కీలకమని పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న “బల్క్ వేస్ట్ జనరేటర్స్ & సోర్స్ సెగ్రిగేషన్ ఎడ్యుకేషన్ వీక్” ద్వారా ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ, నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను అలవాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సంపద సృష్టికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చెత్తను నాలుగు రంగుల డస్ట్బిన్లలో వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వంటగదిలో ఉత్పత్తయ్యే తడి, సేంద్రియ మరియు సులభంగా కుళ్లిపోయే వ్యర్థాలను ఆకుపచ్చ రంగు డస్ట్‌బిన్‌లో వేయాలని సూచించారు. వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరం
