స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత  కుటుంబాలకు పరామర్శ 

Pavan

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు  నారా లోకేశ్, అనిత , మనోహర్   పరామర్శించారు. మంగళవారం ఉదయం కేజీహెచ్‌ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి లోకేష్  మార్చురీలో ఎంతమంది ఉన్నారనే దానిపై జాయింట్ కలెక్టర్ విద్యాధరిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపై సెవన్ హిల్స్ ఆస్పత్రికి  వెళ్లారు. స్టీల్‌ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితుల్ని పరామర్శించారు. భరోసా ఇచ్చారు.