యూనిఫాం, మర్యాదపూర్వక ప్రవర్తన తప్పనిసరి

trafic

రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు పోలీసుల అవగాహన 

రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక నిఘా పెట్టమని త్రీ టౌన్ ట్రాఫిక్ ఏఎస్ఐ మెహర్ బాబు పేర్కొన్నారు. శనివారం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రయాణికులతో ఎలా నడుచుకోవాలి, ట్రాఫిక్ నిబంధనలు ఎలా పాటించాలనే అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ​రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని త్రీ టౌన్ ట్రాఫిక్ ఏఎస్ఐ మెహర్ బాబు స్పష్టం చేశారు.

 స్టేషన్ వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ఆటో డ్రైవర్లు విధిగా కాకి డ్రెస్  యూనిఫాం ధరించాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులతో ఎంతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా నడుచుకోవాలని సూచించారు. ​ప్రతి ఆటో డ్రైవర్ పోలీస్ ఆటో బూత్‌లో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏఎస్ఐ వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు జారీ చేసే క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ప్రతి ఒక్కరూ తమ ఆటోలకు ప్రదర్శనగా అంటించాలన్నారు.

​రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, ఆటోలను అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.