నేటి నుంచి ఫిఫా వరల్డ్ కప్ 

World cup

48 జట్లు , 104 మ్యాచ్ ల మహాసమరం 

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ మరింత వైభవంగా జరగనుంది. మొత్తం 48 జట్లు, 104 మ్యాచ్‌లతో సాగనున్న ఈ మెగా సమరం 39 రోజుల పాటు అభిమానులను ఉత్కంఠలో ముంచెత్తనుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.విజేతకు 48 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు. దీని విలువ భారత్ కరెన్సీలో సుమారు రూ.416 కోట్లు.