అర్హులైన ప్రతి ఒక్కరికి  పింఛన్లు

pension

అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర  గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సోమవారం ఉదయం మంత్రి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 20 వ  డివిజన్ గిలకలదిండిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా కొందరు ప్రజలు తమ ప్రాంతంలో అర్హులైన కొంతమందికి పింఛన్లు రాలేదని వారికి పింఛన్లు మంజూరు చేయాలని,  కొన్ని సరిగా అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాలతో పింఛన్లు అందకపోయి ఉండవచ్చని ఎవరికైనా రాకపోతే తప్పకుండా పింఛన్లు అందజేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రి  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలోని గిలకలదిండిలో పేదల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామన్నారు. .

ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ  తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదనీ,  ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా, ధైర్యం కల్పించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

దేశం మొత్తంలో కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం ఈ  పింఛన్ నిమిత్తం 35 వేల కోట్ల రూపాయలు ఇప్పటికి దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఈ పేదరిక సేవలు కార్యక్రమం కింద వినోయోగిస్తున్నామన్నారు. .ఈ రోజు ఇక్కడ మచిలీపట్నంలో ఇక్కడ ఉన్న గ్రామీణం పట్టణ ప్రాంతాలతో కలిపి 30 వేల పింఛన్లు అర్హులందరికీ ఇస్తున్నామన్నారు. .  ఎవరైనా భర్త చనిపోతే తక్షణమే మరుసటి నెలలో వారి భార్యకి పించను ఇస్తున్నామన్నారు.. ఇక్కడే కొత్త పింఛన్  కూడాఅందజేస్తున్నామన్నారు. .

ఇంకా కొత్తగా వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి పింఛన్లు  ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా గమనంలోకి తీసుకొని త్వరలోనే మిగిలినవి కూడా అందించడానికి ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందన్నారు . దశల వారీగా అది వితంతువులకు, దివ్యాంగులకు వృద్ధులకు ఎవరికి ముందు పించను ఇవ్వాలో రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు

రేషన్ బియ్యం కూడా ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున అందజేస్తామన్నారు..త్వరలో పాఠశాలలు తెరవబోతున్నాం కాబట్టి తల్లికి వందనం పథకం కింద  10,000 కోట్ల రూపాయలు ఈ నెలలో మళ్ళీ తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేయబోతున్నామన్నారు. అట్లాగే అన్నదాత సుఖీభవ రైతులకు పెట్టుబడి సాయం,, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని, మరి ముఖ్యంగా ఆడపిల్లలకు భరోసా ఉండే కార్యక్రమం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గ ఎన్నికల ముందు పేదవారికి ఏ రకమైన హామీలు అయితే ఇచ్చామో ఆ సూపరు సిక్సు పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తూ ఇవాళ  ఇంటింటికి ప్రతి నెల మొదటి తేదీనే పించను ఇస్తుమన్నారు.. గతంలో పింఛను సరిగ్గా అందక పేదలు ఇబ్బంది పడేవాళ్ళనీ, నేడు ప్రతి నెల 1వ తేదీనే ప్రతి ఇంటికి వెళ్లి మరి ఉదయాన్నే ఇవ్వాలనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్నారు.  ప్రభుత్వం పేద వారికి అండగా నిలబడి నిశ్చయంగా సంకల్పంగా ఆదుకుంటూ ఉందన్నారు .

అలాగే ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని ఆ విధంగానే. ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణంమే కాకుండా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ  సభ్యులు విద్యాసాగర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్,  మున్సిపల్ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి రాజేంద్రప్రసాద్, వార్డు సచివాలయ కార్యదర్శులు నవీన్,  సీతారామయ్య, బలరామకృష్ణ, స్థానిక నాయకులు ఇలియాస్ భాష,  సుశీల,  మత్స్యకార సంఘాల నాయకులు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.