అత్యుత్తమ కెరీర్లలో ఒకటిగా కోడింగ్ భావిస్తారు. ఇప్పుడు ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్ రావడంతో పరిస్థితి వేగంగా మారుతోంది. ఎలోన్ మస్క్ మాట్లాడుతూ సంప్రదాయ కోడింగ్ ఈ ఏడాది చివరి నాటికే కనిపించకుండా పోవచ్చన్నారు . ఏఐ నేరుగా కంప్యూటర్‌కు అవసరమైన బైనరీ కోడ్‌ను రూపొందించగలదని, మధ్యలో మనుషులు కోడ్ రాయాల్సిన అవసరం ఉండదన్నారు.
ప్రస్తుతం క్లాడ్ కోడ్, కోడెక్స్ వంటి ఏఐ టూల్స్ కేవలం కోడ్ సూచనలు ఇవ్వడమే కాదు, మొత్తం సాఫ్ట్వేర్ నిర్మాణాన్ని అర్థం చేసుకుని, పరీక్షలు నిర్వహించి, సమస్యలను సరిచేసే స్థాయికి చేరుకున్నాయి అన్నారు . దీంతో ఎంట్రీ-లెవెల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ప్రభావం కనిపిస్తున్నారు .
ఇటీవల విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం, ఎంట్రీ-లెవల్ ఉద్యోగ ప్రకటనలు 35 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది . ఇందులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంత్రోపిక్ కో-ఫౌండర్, సీఈఓ డారియో అమోడి గతంలో ఏఐతో సగం వరకు ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిరుద్యోగం 10 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చని కూడా పేర్కొన్నారు.
ఇటీవల ఆయన తన అభిప్రాయాన్ని కొంత మార్చుకున్నారు. ఏఐ కొన్ని ఉద్యోగాలను తగ్గించినా, కొత్త రకాల పనులను కూడా సృష్టించే అవకాశం ఉందన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏఐ కారణంగా కోడింగ్ పూర్తిగా అంతరించిపోవడం ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు . కానీ కోడర్ల పని విధానం మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది. భవిష్యత్తులో కోడ్ రాయడం కంటే ఏఐకి సరైన సూచనలు ఇవ్వడం, సిస్టమ్‌లను రూపకల్పన చేయడం, సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండవచ్చు .
