124 ఏళ్ల మొసలి హెన్రీ 

Crocodiles

హెన్రీ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మొసళ్లలో ఒకటి. ఇది 124 ఏళ్ల వయస్సు గల నైల్ మొసలి. సుమారు 1900 ప్రాంతంలో బోట్స్వానాలోని ఒకావాంగో డెల్టాలో జన్మించినట్లు భావిస్తున్నారు.

దానికి  హెన్రీ అనే  పేరు ఎలా వచ్చిందో తెలుసా ?  సర్ హెన్రీ న్యూమన్ అనే వేటగాడి పేరు నుంచి వచ్చింది. ఒకప్పుడు ప్రజల పాలిట  ప్రమాదంగా మారిన ఈ మొసలిని చంపడానికి పంపిన న్యూమన్, దానిని చంపకుండా కాపాడారు. అప్పటి నుంచి హెన్రీ పేరుతో  ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ మొసలి. 

1985 నుంచి  హెన్రీ దక్షిణాఫ్రికాలోని క్రోక్ వరల్డ్ కన్సర్వేషన్ సెంటరులో నివసిస్తోంది. రక్షిత వాతావరణం, సరైన ఆహారం, వైద్య సంరక్షణ వల్ల దీర్ఘకాలం జీవించగలిగిందని నిపుణులు భావిస్తున్నారు.హెన్రీ సుమారు 5 మీటర్లు (16 అడుగులు) పొడవు, 700 కిలోల బరువు ఉంది . ఇది ప్రపంచంలోని అతిపెద్ద  మొసళ్లలో ఒకటి.హెన్రీ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటివరకు 10,000 కంటే పైగానే    పిల్లలని కన్నది .  మొసళ్ల సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.

హెన్రీ కథ కేవలం ఒక మొసలి కథ మాత్రమే కాదు. సరైన సంరక్షణ ఉంటే జంతువులు ఎంతకాలమైనా జీవించగలవు అని చెప్పడానికి ఇదొక  అద్భుత ఉదాహరణ. 124 ఏళ్ల వయస్సులోనూ హెన్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.