పల్లెకాపులకు త్వరలో పట్టాలు పంపిణీ: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

D48430f0 81d0 4285 99dc e2d0fbc2ed37

నెల్లూరు  :

నెల్లూరు జిల్లాలో  వినూత్నంగా  ప్రారంభించిన పల్లె వీక్షణం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముత్తుకూరు మండలం పిడతా పోలూరుగ్రామంలోశుక్రవారం నిర్వహించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జలజీవన్ మిషన్, అంగన్వాడి సెంటర్, ఆరోగ్య కేంద్రo, డ్రిప్ ఇరిగేషన్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం, గ్రామస్తులతో ముఖాముఖి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ అనిమల్ హస్బెండరీ మరియు సేర్ఫ్ స్థానిక సచివాలయం వద్ద ప్రజల నుండి అర్జులను కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వీకరించారు. పాత్రికేయులతో మాట్లాడుతూ గత 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సహజసిద్ధంగా ఎరువులు తయారు చేస్తున్న సహాయక గ్రూపు మెంబర్ కళ్యాణికి ప్రభుత్వం తరఫునుంచి ఆర్థిక సహాయం చేసి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందన్నారు. పిడత పోలూరు లోని కొన్ని ఎస్టీ కాలనీలలో లో విద్యుత్ ఉన్నందున ఆ సమస్యను అధిగమించే విధంగా త్రీ పేజీ లైన్ ఏర్పాటు చేసి రెండు నెలలలో విద్యుత్ సమస్యను అధిగమించడం జరుగుతుందన్నారు.
పిడత పోలూరులో దాదాపుగా ప్రధాన సమస్యలను  పరిష్కరించడం జరిగిందన్నారు.

అనంతరం లబ్ధిదారులయిన పెంచలమ్మ, సీనయ్య తదితరులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.  వెంకటమ్మకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను అందజేశారు. స్వయ సహాయక గ్రూపు సంఘాలకు నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పిఎండిఎస్ విత్తనాలను అందజేశారు. అనిమల్ హస్బెండ్రీ శాఖ ద్వారా ఫీడర్ కిట్లను లబ్ధిదారుల అందజేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి నాగ అనూష, డి ఆర్ డి ఎ పి డి నాగరాజ కుమారి, ఐటీడీఏ పీవో శ్రీనివాసరావు, జిల్లా వైద్యశాఖ అధికారి సుజాత, వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ రాఘవేంద్ర, డీఈవో బాలాజీ రావు మరియు వివిధ శాఖల అధికారులు మండల రెవెన్యూ అధికారి స్వప్న, మండల పరిషత్ అధికారి నాగమణి తదితరులు పాల్గొన్నారు.