ఏఐ ఇక సడెన్ హార్ట్ స్ట్రోక్స్ ని గుర్తిస్తుంది?

Ai heart

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చరిత్ర  సృష్టించింది . ముందస్తు లక్షణాలు లేకుండానే సంభవించే ఆకస్మిక గుండె మరణాల  ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే కొత్త ఏఐ ఫీచర్ ని  బర్కిలీ పరిశోధకులు డెవలప్ చేశారు . సాధారణ ఈసీజీ  టెస్ట్ లో కూడా డాక్టర్స్ కనిపెట్టలేని డీప్ రీసెర్చ్ ద్వారా ఏఐ గుర్తించింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం 1.98 కోట్ల మంది సడెన్ హార్ట్ టాక్స్ తో చనిపోతున్న విషయం తెలిసిందే . గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ, ఆకస్మిక గుండె మరణాలు ముందస్తు హెచ్చరికలు లేకుండానే సంభవిస్తాయి. ముఖ్యంగా యువకులు, క్రీడాకారుల్లో  ఈ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రస్తుతం గుండె పనితీరును అంచనా వేయడానికి లెఫ్ట్ వెంట్రిక్యులర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్  పరీక్షను చేస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా  ప్రమాదాన్ని పూర్తిగా గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా జియాద్ ఒబెర్మీయేర్ నేతృత్వంలోని ఒక టీమ్ సుమారు పదేళ్ల పరిశోధన అనంతరం, స్వీడన్‌కు చెందిన 4.4 లక్షల ఈసీజీ రికార్డుల ఆధారంగా ఏఐ మోడల్‌ను రూపొందించింది.ఈ ఏఐ ఈసీజీ తరంగాల్లో ఇప్పటివరకు గుర్తించని ప్రత్యేక నమూనాను గుర్తించి, ఆకస్మిక గుండె మరణాల ప్రమాదాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసింది. పరిశోధనలో ఏఐ అధిక ప్రమాదంగా గుర్తించిన రోగుల్లో ఏడాదికి 7 శాతం మందికి గుండె మరణం సంభవించే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న పద్ధతులతో ఈ ప్రమాదం 4.6 శాతం మాత్రమే గుర్తించబడుతోందని తేలింది. అంతేకాకుండా, ఏఐ గుర్తించిన 86 శాతానికి పైగా అధిక ప్రమాద రోగులను ప్రస్తుత స్క్రీనింగ్ విధానాలు గుర్తించలేకపోయాయి.

ఈ సాంకేతికత నేరుగా ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేయదు . కాకపోతే ప్రమాదంలో ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన అదనపు వైద్య పరీక్షలు, చికిత్సలను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది అని  పరిశోధకులు భావిస్తున్నారు.