విజయవాడ నగరంలో అందాల తారలు శివాని నాగారం, పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. బి ఆర్ టి ఎస్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన ది మార్క్స్ స్టూడియో ను వారు లాంఛనంగా ప్రారంభించారు.ఆధునిక కాలంలో యువతి యువకులు హెయిర్ స్టైల్, మేకప్ పట్ల అమిత ఆసక్తి చూపిస్తున్నారనీ అన్ని రకాల సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్, శివాని నాగారం పేర్కొన్నారు….
విజయవాడ బి ఆర్ టి ఎస్ రోడ్ చైతన్య స్కూల్ సమీపంలో నూతనంగా ది మార్క్స్ స్టూడియో ను నూతనంగా ఏర్పాటు చేశారు. సినీ హీరోయిన్స్ శివాని నాగారం పాయల్ రాజ్ పుత్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా రవితేజ , స్టూడియో యజమాని వంశీతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్టూడియోలో అందిస్తున్న సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్ శివాని నాగారం మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తమకు ఎంతో ఇష్టమని విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. తాము ముఖ్యంగా హెయిర్ మేకప్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. రకరకాల మేకప్ లు హెయిర్ స్టైల్స్ చేయించుకుంటామని అయితే మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. యువతి యువకుల అభిరుచుల కనుగుణంగా హెయిర్ స్కిన్ మేకప్ మెయిల్ తదితర సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మరిన్ని స్టూడియోస్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
అనంతరం ది మార్క్స్ స్టూడియో నిర్వాహకులు వంశీ, రవికిరణ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం, బి ఆర్ టి ఎస్ రోడ్, భాను నగర్ మధురానగర్ ప్రాంత వాసుల కోసం ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ అందుబాటులో అన్ని రకాల సేవలు లభిస్తాయని స్కిన్ హెయిర్ మెయిల్ మేకప్ సేవలు లభిస్తాయని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని స్టూడియోస్ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు..
