నేటి నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్డుకు మరమ్మతులు

Durgamma to day

భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందు సాగుతున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ చెప్పారు. దీనిలో భాగంగా మంగళవారం నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్ మరమ్మతులు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతుల నిమిత్తం జూన్ 12వ తేదీ వరకు వివిధ స్థాయిల్లో పనులు జరుగుతాయని దీనికోసం ఘాట్ రోడ్డు మూసివేశారని పేర్కొన్నారు. ఈ పనులు జరుగుతున్న క్రమంలో దుర్గమ్మ భక్తులు శ్రీ కనకదుర్గ నగర్ వైపు రాకపోకల నిమిత్తం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.