సేఫ్టీ ఫస్ట్: విజయవాడలో స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్

School Bus Special Drive

విద్యార్థుల భద్రతే లక్ష్యం – స్కూల్ బస్సులపై కట్టుదిట్టమైన తనిఖీలు

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వీ రాజశేఖర్ బాబు, ఐపీఎస్ గారి సూచనల మేరకు, డీసీపీ (ట్రాఫిక్) శ్రీమతి షరీన్ బేగం మేడమ్ గారి ఆదేశాల ప్రకారం, త్రీ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శ్రీవేద మేడం గారు, త్రీ ట్రాఫిక్ సిఐ శ్రీ సుధాకర్ గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూలు బస్సులను ఈరోజు తనిఖీ చేశారు.
ఈ తనిఖీలలో భాగంగా బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, విద్యార్థులకు అనుగుణంగా సీట్ల ఏర్పాటు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పరిస్థితి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటు మరియు వాటి ఎక్స్‌పైరీ తేదీలను పరిశీలించారు. అదేవిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయా లేదా, ఉంటే వాటి గడువు తేదీ మరియు వినియోగంపై డ్రైవర్‌కు అవగాహన ఉందా అనే అంశాలను కూడా తనిఖీ చేశారు
అలాగే, హెల్పర్లు/ఆయాలు విద్యార్థులను సురక్షితంగా రోడ్డును దాటించే విధానం, డ్రైవర్ బస్సును ఎక్కడ ఆపాలి అనే అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా బస్సుల్లో సీసీ కెమెరాలు, నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం మరియు ఆర్టీఓ ద్వారా జారీ చేసిన స్పీడ్ లిమిట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని స్కూల్ యాజమాన్యానికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై జివిఎన్ కుమార్, కానిస్టేబుల్స్ సుబ్రహ్మణ్యం, వీరబాబు, కిషోర్ ,రవిశంకర్ పాల్గొన్నారు