మథురానగర్(విజయవాడసెంట్రల్): స్వయంభూ మాచవరం శ్రీ దాసాఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో భక్తులు సమర్పించిన కొబ్బరి చెక్కలు ప్రోగు చేసు కునే హక్కు కోసం వచ్చేనెల 5వతేదీన ఆలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పాతూరి లోకేశ్వరి, ధర్మకర్తల మండలి ఛైర్మన్ సోడిశెట్టి కృష్ణప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తేదీ శుక్రవారం
ఉదయం 10.30 గంటలకు బహిరంగ వేలం జరుగుతుందన్నారు. కావున ఆసక్తి కలిగిన వారు వేలం పాటలో పాల్గొనాల్సిందిగా వారు కోరారు. మరింత సమాచారం కోసం ఆలయ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా వారు సూచించారు.
కొబ్బరిచెక్కలు పోగు చేసుకునేందుకు బహిరంగ వేలం 5న
