పద్మ అవార్దుల కోసం ధరఖాస్తుల స్వీకరణ 

తెలుగు వేవ్ లోగో
మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము, కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము  సూచనల మేరకు రిపబ్లిక్ డే,  2027  సందర్బముగా ప్రకటించే  దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ అవార్దుల” కోసం నామినేషన్లు ఎన్.టి.ఆర్, కృష్ణా జిల్లాల నుండి ఆహ్వానిస్తున్నారు .  దరఖాస్తులు  1.పద్మ విభూషణ్, 2.పద్మ భూషణ్, 3.పద్మశ్రీ  మూడు విభాగాలకు ఇవ్వవచ్చు .   ఈ అవార్డులు  పొందాలని కోరుకునేవారు ఈ క్రింద పేర్కొన్న  పేర్కొన్న రంగాలలో  విశిష్ట సేవలు  అందించి ఉండాలి .
1) కళలు (Arts )
2) సాహిత్యము మరియు విద్య (Literature & Education)
3) క్రీడలు  (Sports)
4) వైద్యం (Medicine)
5) సామాజిక / సాంఘిక సేవ (Social Work)
6) సైన్స్ మరియు ఇంజనీరింగ్  (Science & Engineering)
7) ప్రజా సంబంధాలు (Public Affairs)
8) సివిల్ సర్వీసులు (Civil Services)
9) ట్రేడ్ మరియు ఇండస్ట్రీ  ( Trade & Industry)
పైన పేర్కొన్న రంగములో ఉత్తమ సేవ కనబరచిన వారు, వారి దరఖాస్తును ప్రభుత్వ వెబ్ సైట్ (రాష్ట్రీయ పురస్కార పోర్టల్) https://awards.gov.in లో  తేది.30-05-2026 లోగా  నమోదు చేసుకోవాల్సి ఉంటుంది .  ఆ తరువాత ఆ అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి  వివరములను జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయములో ఒక హార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది .  అంతేకాకుండా కార్యాలయ మెయిల్ dywokrishna@yahoo.co.in నకు ఒక సాఫ్ట్ ప్రతిని కూడా పంపించాలి .  ఇక  పద్మ అవార్డుల దరఖాస్తుకు సంబంధించిన  ఇతర వివరముల కోసం  భారత ప్రభుత్వ శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్  www.padmaawards.gov.in   లో తెలుసుకోవచ్చు .
ఈ అవార్డుల కొరకై దరఖాస్తు చేసుకోవాలనుకునే  ఎన్.టి.ఆర్ & కృష్ణా జిల్లాలకు చెందిన ఔత్సాహికులు ఈ నెల 30 వ తేది లోగా దరఖాస్తు చేసుకొనవలసినదిగా డాక్టర్  కొల్లేటి రమేష్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా యువజన సంక్షేమ శాఖ ,స్టెప్, క్రిషి, విజయవాడ విభాగములు ఒక ప్రకటనలో తెలియపరిచినారు.