జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా డా. కె. అనిత 

.jpg

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా డా. కె. అనిత 

కాకినాడ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణిగా డాక్టర్. కె.అనిత బుధవారం బాధ్యతలుస్వీకరించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం ఇంచార్జి డిఎం ఆండ్  హెచ్ఓగా బాధ్యతలు నిర్వహిస్తు పదోన్నతిపై కాకినాడ జిల్లాకు వచ్చారు.వైద్య రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వైద్యాధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు.

డా. కె. అనిత ఏలేశ్వరం మెడికల్ ఆఫీసర్ గా, కాకినాడ జిజిహెచ్ డిప్యూటీ సివిల్ సర్జన్, ఆర్ఎమ్ఓగా బాధ్యతలు నిర్వహించారు. గత సంవత్సరం  శ్రీకాకుళం జిజిహెచ్ సీఎస్ ఆర్ఎమ్ఓగా బదిలీపై వెళ్ళి, ఇంచార్జి డిఎం ఆండ్ హెచ్ఓ గా విధులు నిర్వహించారు. కాకినాడ జిల్లాకు పూర్తి స్థాయి డిఎం ఆండ్చ్ గా బదిలీపై వచ్చారు.వైద్య అధికారిణిగా జిల్లా ఆరోగ్య పరిస్థితులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, జిల్లా కలెక్టర్ సూచనలతో, సహచర అధికారులు, సిబ్బంది సమన్వయంతో జిల్లా ప్రజల ఆరోగ్య రక్షణ కు పని చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డా.అనితను కార్యాలయం సిబ్బంది, పలువురు వైద్య అధికారులు అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.