నిత్యాన్నదానానికి లక్ష విరాళం

anna danam

విజయవాడ( సత్యనారాయణపురం): విజయవాడ ముత్యాలంపాడు లోని షిరిడి సాయిబాబా మందిరానికి దాతలు బి సూర్యనారాయణ మూర్తి, ఇందిరా దేవి దంపతులు లక్ష రూపాయలు విరాళంగా సమర్పించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతలు మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న నిత్యానదానానికి తాము కూడా భాగస్వాములు కావాలని సదుద్దేశంతో విరాళం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి దాతలకు బాబా వారి శేష వస్త్రం, చిత్రపటం అందజేశారు.