కిటికీల నుంచి దూకిన ప్రయాణికులు
జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు శనివారం అగ్ని ప్రమాదానికి గురైంది. రన్నింగ్లో ఉండగా మంటలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై గొల్లపూడి సమీపంలో బస్సును పక్కకు ఆపడంతో ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
