బాలబాలికలకు వేసవి శిక్షణ శిబిరాలు

akividu summer camp

ఆకివీడు : పిల్లల్లో  సామాజిక స్పృహను కల్పించేలా వేసవి శిక్షణ  శిబిరాలను ఏర్పాటు చేయడం హర్షనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆకివీడు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా బాలబాలికలకు వివిధ ఆటలు పాటలతో కూడిన వినోద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా జరిగిన ప్రారంభసభకు ఆకివీడు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ బి కళ్యాణి అధ్యక్షత వహించారు. ఈస్ట్ పాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రమేశ్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలబాలికలు ఆటలతో మానసిక ఉల్లాసాన్ని పొందాలని కోరారు. నాలుగు గోడల మధ్యన స్మార్ట్ ఫోన్ లకు పిల్లలు అతుక్కుపోతున్నారని దాని నుంచి  బయట పడాలని సూచించారు.. పిల్లలను సోషల్ మీడియా నుండి మరల్చే ఇటువంటి కార్యక్రమాలకు ప్రజలందరూ చేయూత ను ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

యుటిఎఫ్ మండల అధ్యక్షులు విక్రమ్  మాట్లాడుతూ పిల్లల్లో విజ్ఞాన కాంతులు  వెలిగించేలా ఇటువంటి వేసవి శిక్షణ  శిబిరాలు  నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేలా వేసవి సెలవుల్లో ఇలాంటి క్యాంపులు నిర్వహించడం ఆనందదాయకమని నిర్వాహకులను అభినందించారు.

 ఉపాధ్యాయులు,  కవి పెంకి విజయ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం యావత్ ఉపాధ్యాయ సంఘం ప్రయత్నించాలని చెప్పారు, వేసవిలో పిల్లల్లో సైన్స్ భావజాలాన్ని పెంపొందించేలా ఆకివీడు చిల్డ్రన్స్ క్లబ్  వారు నిర్వహిస్తున్న ఇలాంటి వినోద శిబిరాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జీవీ లావణ్య, బి. సంధ్యారాణి, నాగ భవాని, శ్రీదివ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు