ఉండేది ఎవరు.. వెళ్లేది ఎవరు!

26srh rr1

నేడు రాజస్థాన్ రాయల్స్, ఎస్ ఆర్ హెచ్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్

రాత్రి 7:30 గంటలనుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం

ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తర ఘట్టానికి చేరుకుంది. గత సీజన్లో పేలవ ప్రదర్శన కనపరిచిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి చక్కని ప్రతిభ కనబరిచి మళ్లీ ప్లే ఆఫ్స్ కు చేరింది. మరోసారి విజేతగా నిలవాలని సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ముందుగా నాకౌ ట్ మ్యాచ్ కి ఆ జట్టు సభ్యులు సిద్ధమయ్యారు. బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో మరో మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో నెగిన జట్టు క్వాలిఫైయర్ టు కు అర్హత సాధించడం, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

కమ్మిన్స్ నాయకత్వంలోని సన్రైజర్స్ లీగ్ దశలో 9 విజయాలతో మూడో స్థానంలో నిలవగా.. పరాక్ కెప్టెన్సీలో 8 విజయాలు సాధించిన రాజస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది. రెండు చెట్ల మధ్య తాజా సీజన్లో జరిగిన రెండు మ్యాచుల్లో గెలిచి హైదరాబాద్ పై చేయి సాధించింది. మానసికంగా ఇది రైజర్స్ కి స్ఫూర్తి, ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనకు కేరాఫ్ గా నిలుస్తూ క్లాసన్ (606), ఇషాన్ కిషన్(569), అభిషేక్ శర్మ(563), హెడ్(393) సీజనును శాసించారు. వీరిని నిలువరించగలిగితేనే రాజస్థాన్ కు విజయ అవకాశాలు ఉంటాయి. చక్కటి బౌలింగ్ తో మలింగ (19), సాకిబ్ (15) వికెట్లు తీసుకొని ప్రత్యర్ధులను కట్టడి చేస్తున్నారు.

మరోవైపు రాజస్థాన్ ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (583), యశస్వి జైస్వాల్ (397) ఇచ్చే శుభారంభం పై ఆధారపడుతోంది. ధృవ్ జూరేల్ (458) కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించాడు. బౌలింగ్లో ఆర్చర్కు (21) వంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉంది. బ్రిజేష్ శర్మ, బర్గర్ కూడా రాణించాల్సి ఉంది.
రెండు జట్లలో చక్కటి ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే రెండు జట్లలోని బౌలర్లు ప్రత్యర్థి జట్లలోని టాపార్డర్ను నిలువరించగలిగితేనే విజయంపై ధీమాతో ఉండేది. వీరిలో ఎవరిని విజయలక్ష్మి వరిస్తే వారే టోర్నీ లో నిలిచేది.. మిగిలిన వారు నిష్క్రమించేది.