కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు పవి బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు డీఐఈవోగా పనిచేసిన కేశవరావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో రాంబాబు పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా డీఐఈఓను కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం అభినందించారు.
