రాజ్యసభ సభ్యుడు , ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) కార్యదర్శీ సానా సతీష్ రెండవ సారి రాజ్యసభకు ఎంపికైన సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని (కనకదుర్గ అమ్మవారిని) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనం.. ప్రత్యేక పూజలు: భార్య, కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ అమ్మవారిని దర్శించుకున్నారు. తాను ప్రజాసేవలో ముందుకు సాగేందుకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం ఆలయ పండితులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ చేతుల మీదుగా బహూకరించారు.
