జోన్-2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా తిమ్మప్ప

Untitled design

VIJAYAWADA: సమాచార పౌర సంబంధాల శాఖ జోన్-2, విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా (రీజినల్ జాయింట్ డైరెక్టర్) పి. తిమ్మప్ప బుధవారం అధికారికంగా సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించారు.

నగరంలోని ఎన్జీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తిమ్మప్ప మాట్లాడుతూ… సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, తోటి అధికారులు, కార్యాలయ సిబ్బంది, జోన్ -2 పరిధిలోని డి.ఐ.పి.ఆర్.ఓ లు , డిప్యూటీ డైరెక్టర్లు, డీఈ లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏఈ లు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారుల (డీఐపీఆర్వోలు) , పిఆర్వోలు , ఇంజనీరింగ్ సిబ్బంది సహకారం, సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మీడియా సమన్వయంతో ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరేలా సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల ప్రచారాన్ని మరింత సమర్ధవంతంగా, ప్రజలకు చేరువయ్యేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని పి. తిమ్మప్ప తెలియజేశారు.
అనంతరం కార్యాలయ అధికారులతో, సిబ్బందితో సమావేశమై, ప్రస్తుతం అమలులో ఉన్న కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, శాఖా పరమైన ప్రాధాన్యత అంశాలపై సమీక్ష నిర్వహించి, సమన్వయంతో పనిచేసి శాఖ పనితీరును మరింత మెరుగుపర్చాలని పి. తిమ్మప్ప సూచించారు.