AMALAPURAM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( ఏపీపీటీడీ), డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారిగా నియమితులైన జి. సత్యనారాయణ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. జి. సత్యనారాయణ ఇంతకుముందు విజయనగరం జిల్లాలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్ & కమర్షియల్) డిప్యూటీ. {సిటిఎం ( ఓ & సి)] గా విధులు నిర్వహించారు. రవాణా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన, సంస్థ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సేవల అందజేత, ఆదాయ వృద్ధి మరియు సేవల నాణ్యత పెంపుదలకు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు .
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజా రవాణా సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన నాయకత్వం దోహదపడుతుందని అధికారులు మరియు సిబ్బంది ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఆర్టీసీ సిబ్బంది పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.
