ఘటనా స్థలంలో పోలీసులు
విజయవాడలో కలకలం రేగింది. కృష్ణ బ్యారేజీ సమీపంలో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది .. కృష్ణా నదిలో పిండాల రేవు ప్రాంతం వద్ద మృతదేహం నీటిపై కొట్టుకురావడాన్నిస్థానికులు గమనించారు. భయాందోళనకు గురైన వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు .
వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయించారు. అనంతరం పంచనామా చేసి , పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి కొట్టుకువచ్చాడు? ఇది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
