-అభిజిత్‌పై క్రష్ అంటూ ఓపెన్‌గా చెప్పేసిన కంటెస్టెంట్!
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో షాలిని దామెర ఎంట్రీతోనే స్టేజ్‌పై సందడి మొదలైంది. కరీంనగర్‌కు చెందిన షాలిని గత ఏడేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నానని చెప్పింది. అయితే ఆమె ఎంట్రీలో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం మాత్రం అభిజిత్‌తో ఆమె చేసిన ఫ్లర్టింగ్. స్టేజ్‌పైకి వచ్చిన వెంటనే అభిజిత్‌ను టార్గెట్ చేస్తూ సరదాగా మాట్లాడటంతో శ్రీముఖి కూడా అదే విషయాన్ని పట్టుకుంది.
‘అందరికీ ‘గారు’ అని పెట్టి.. అభిజిత్ అన్నావన్నమాట?’ అని శ్రీముఖి ప్రశ్నించింది. దానికి షాలిని.. ‘ఇప్పుడు చెప్పడం కంటే ఆడిషన్ అంతా అయిపోయాక చెప్పడం బెటర్ అనిపించింది’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆమె మాటలకు శ్రీముఖి ‘సమ్‌థింగ్.. సమ్‌థింగ్’ అంటూ ఆటపట్టించడంతో అభిజిత్ ముఖంలోనూ చిన్న చిరునవ్వు కనిపించింది.
ఇక షాలిని పరిచయాన్ని కూడా నవదీప్ సాధారణంగా కాకుండా టాస్క్ రూపంలోనే తీసుకున్నాడు. ఏదైనా పాటకు డాన్స్ చేస్తూ తన గురించి చెప్పాలని కోరగా.. షాలిని అలాగే డాన్స్ చేస్తూ తన పరిచయాన్ని ఇచ్చింది.
అక్కడితో ఆగకుండా నవదీప్ మరో టాస్క్ ఇచ్చాడు. ఫోన్‌ను పగలగొట్టాలని చెప్పడంతో షాలిని ఫోన్‌ను పగలగొట్టేందుకు ప్రయత్నించింది. ఒక్కసారి కొట్టినా ఫోన్ పగలకపోవడంతో శ్రీముఖి కూడా రంగంలోకి దిగి దాన్ని పిప్పి పిప్పి చేసింది. తర్వాత మురికిగా ఉన్న షూస్‌ను క్లీన్ చేయాలని టాస్క్ ఇచ్చారు. మొదట ‘నేను చేయను’ అంటూ షాలిని చెప్పినా.. చివరికి కూర్చుని షూస్ క్లీన్ చేసింది. అయితే వాటిని నీటిలో డిప్ చేయడంతో బిందు మాధవికి కోపం వచ్చింది. ‘అలా వాటర్‌లో డిప్ చేయరు’అంటూ ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది.
అయితే అభిజిత్ మాత్రం షాలిని చేసిన పనిని మరో కోణంలో చూశాడు. ఆమెను అక్కడితో ఆపేసి స్టేజ్‌పైకి రమ్మన్నాడు. ‘నువ్వు స్టాండ్ తీసుకుని షూస్ క్లీన్ చేశావు. ఫైన్. ఏ పని చిన్నది, పెద్దది అని కాదు. ఇంట్లో నా షూస్ నేనే క్లీన్ చేసుకుని రావాలి. వేరేలా అనుకోకు. చాలా బాగా ఆడావు’ అంటూ షాలినిని అభిజిత్ ప్రశంసించాడు. అనంతరం ఆమెకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.
అభిజిత్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ రావడంతో షాలిని భావోద్వేగానికి గురైంది. నవదీప్ ‘ఇప్పుడు చెప్పు’ అని అడగ్గా.. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది.
‘ఎలాగైనా అభిజిత్ గారితో ఇంప్రెస్ చేయించుకోవాలని పట్టుదలతో వచ్చాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మెంటల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే ఎవరినైనా ఓడించొచ్చని ఆయన చెప్పారు. ఆయన నుంచి నాకు గ్రీన్ ఫ్లాగ్ రావడం చాలా స్పెషల్’ అంటూ చెప్పింది. అంతేకాదు.. ‘మీరు ఎందుకు ఇన్‌స్పిరేషనో మళ్లీ ప్రూవ్ చేశారు. నేను స్టేజ్ మీదకు వచ్చినప్పుడు కూడా షివర్ అవ్వలేదు. కానీ ఆయన హగ్ ఇచ్చినప్పుడు మాత్రం..’ అంటూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంది.
దీంతో అభిజిత్ కూడా సరదాగా ఆమెను ‘నా బంగారం’ అన్నట్టుగా నోటికలు విరిచాడు. షాలిని కూడా అదే విధంగా స్పందిస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.
అక్కడితో ఆగకుండా శ్రీముఖి మరో ట్విస్ట్ ఇచ్చింది. ‘నాకెందుకో నువ్వు మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చినట్టు అనిపించలేదు. వెళ్లు’ అంటూ షాలినిని ఆటపట్టించింది. దీంతో షాలిని వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి అభిజిత్‌ను హగ్ చేసుకుంది. అభిజిత్ కూడా లేచి ఆమెను హగ్ చేసుకున్నాడు.
‘ఐ లవ్ యూ డార్లింగ్’ అంటూ షాలిని చెప్పడంతో స్టేజ్‌పై నవ్వులు పూశాయి.
ఇక నవదీప్ కూడా షాలినికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి మాత్రం రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. అయితే ఆ రెడ్ ఫ్లాగ్‌ను కూడా షాలిని పాజిటివ్‌గా తీసుకుంది.
‘నేను రెడ్‌ను ఎప్పుడూ తప్పుగా తీసుకోలేదు’ అంటూ బిందు మాధవిని హగ్ చేసుకుని చెప్పింది. అనంతరం నవదీప్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. మొదట పగలగొట్టమన్న ఫోన్‌ను తిరిగి షాలినికే ఇచ్చాడు. ఫోన్ చేతిలోకి రావడంతో ఆమె ముఖంలో ఒక్కసారిగా వెలుగు కనిపించింది. ‘అయిపోయిందనుకున్నా. మళ్లీ ఇప్పుడు లక్షన్నర ఎక్కడి నుంచి తేవాలి అనుకున్నా. నిజానికి ఒకటి చెప్పాలి.. దీనికి యాపిల్ కవర్ ఉంది’ అంటూ షాలిని చెప్పడంతో నవదీప్ పంచ్ వేశాడు.
‘అమ్మా.. నాగార్జున గారు వాళ్లు ఫోన్ ఇన్సూరెన్స్‌తో వచ్చారండి! ఏంటిది? నీ ఫోన్ ఏమీ పగలగొట్టలేదు. అర్థమైంది కదా?’ అంటూ నవదీప్ నవ్వించాడు.
అయితే ఈ ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. శ్రీముఖి నేరుగా షాలినిని అడిగేసింది.’నేను ఓపెన్‌గా అడిగేస్తున్నా. పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకుంటావా?’అని ప్రశ్నించింది. ‘ఎవరు చేసుకోరండి?’ అంటూ షాలిని సమాధానం ఇవ్వడంతో అభిజిత్ సిగ్గుపడినట్టుగా తెల్ల కాగితాన్ని ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. దీంతో శ్రీముఖి, బిందు మాధవి కలిసి మరో సరదా చర్చ మొదలుపెట్టారు. ‘బిందు.. అగ్నిపరీక్ష సీజన్ 2 అంతా వాళ్లను ఎలా కలపాలి అన్న ప్రయత్నంలో మనం ఉందాం’ అంటూ శ్రీముఖి చెప్పింది.
‘నేను అబ్బాయి సైడ్ నుంచి.. నువ్వు అమ్మాయి సైడ్ నుంచి’ అంటూ బిందు మాధవి అనగా.. ‘నేను ముహూర్తాలు పెడతాను’ అంటూ నవదీప్ కూడా రంగంలోకి దిగాడు. ‘అంటే అన్నారు కానీ ఆ మాట…’ అంటూ షాలిని సిగ్గుపడటం స్టేజ్‌పై మరింత నవ్వులు పూయించింది. చివరగా నవదీప్.. ‘మరి అభిజిత్‌కి స్నాప్‌చాట్ చూపిస్తావా?’ అని అడిగాడు. దానికి షాలిని ఏమాత్రం మొహమాటం లేకుండా.. ‘అవును చూపిస్తా. నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు కదా. ఆయన మీద నాకు క్రష్ ఉంది’ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది.
మొత్తంగా షాలిని దామెర ఎంట్రీ టాలెంట్‌తో పాటు అభిజిత్‌పై తనకున్న క్రష్‌ను బహిరంగంగా చెప్పడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఫోన్ పగలగొట్టే టాస్క్ నుంచి షూస్ క్లీన్ చేయడం వరకు.. జడ్జీల ఫ్లాగ్స్ నుంచి అభిజిత్‌తో హగ్, చివరికి ‘క్రష్ ఉంది’ అనే ఓపెన్ స్టేట్‌మెంట్ వరకు షాలిని ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్‌తో సాగింది.
