మీరు మా అల్లుళ్లేమీ కాదు.. జైల్లో కూచోపెట్టడానికి.. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్

west bengal News

బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి మంగళవారం బంగ్లాదేశీయులను దేశం విడిచి వెళ్లాలని కోరారు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించి పోలీసులకు అప్పగించాలని, ఆ తర్వాత వారిని తిరిగి పంపేందుకు బీఎస్ఎఫ్ సహకరిస్తుందని ఆయన అన్నారు. “త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోండి, లేకపోతే మేము చర్య తీసుకుంటాము. మేము చొరబాటుదారులను జైల్లో పెట్టి వాళ్లకు ఆహారం పెట్టము. వాళ్ళు మా అల్లుళ్లు కాదు. వాళ్ళను  తరిమివేస్తాము.” అని సువెందు హెచ్చరించారు .  ఈ కర్మమంలో మా వాళ్లను తీసుకుపోతామని వాళ్ల (బంగ్లాదేశ్) అధికారులు కూడా చెప్పారని అయన అన్నారు .

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో, మంగళవారం ఉదయం నుంచి హకీంపూర్ చెక్‌పాయింట్ వద్ద 100 మందికి పైగా విదేశీయులు గుమిగూడారు. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న వీరు, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు సరిహద్దుకు వస్తున్నారని చెబుతున్నారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అరెస్టు అయిన ముగ్గురు బంగ్లాదేశీ జాతీయులను నిర్బంధ కేంద్రానికి పంపిన రాష్ట్రంలోని మొదటి జిల్లాగా ముర్షిదాబాద్ నిలిచింది.
విదేశీయులుగా అనుమానితులను 30 రోజుల పాటు నిర్బంధ కేంద్రంలో ఉంచవచ్చు.

‘గుర్తించు, తొలగించు, బహిష్కరించు’ విధానాన్ని అమలు చేయడానికి, దేశ బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న అనుమానిత విదేశీయులు, చొరబాటుదారుల కోసం నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కేవలం ఒక రోజు ముందే అన్ని జిల్లాలను ఆదేశించింది.

మే 23న జారీ చేసిన ఒక ఉత్తర్వులో, అనుమానిత విదేశీయులను నిర్బంధించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. అనుమానిత విదేశీయులను అటువంటి కేంద్రాలలో గరిష్టంగా 30 రోజుల పాటు నిర్బంధించవచ్చు, ఈ సమయంలో వారి పత్రాలు, గుర్తింపు, పౌరసత్వాన్ని తనిఖీ చేస్తారు.

స్క్రీనింగ్ సమయంలో, ప్రజల బయోమెట్రిక్ డేటాను సేకరించి ఒక కేంద్ర పోర్టల్‌కు అప్‌లోడ్ చేస్తారు. గుర్తించిన తర్వాత, వారిని దేశ బహిష్కరణ కోసం సరిహద్దు భద్రతా సంస్థలకు అప్పగిస్తారు. తుది నిర్ణయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ లేదా ఒక ఉన్నతాధికారి తీసుకుంటారు.