భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్రకు నివాళి  

CHANDRA

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావు 112 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ లో సోమవారం జరిగిన జయంతి సభలో పలు రంగాల ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. తొలుతగా ప్రాంగణంలోని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి, ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ, నీలం రాజేశ్వర్ రెడ్డి విగ్రహానికి సి ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ‘బొద్దింకల ఆవిర్భావం – యువత, నెటిజెన్స్ ఎటువైపు’ అనే అంశంపై కే శ్రీనివాసరెడ్డి స్మారక ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ సభ్యులు పీజే చంద్రశేఖర రావు, హోమ్ డైరెక్టర్ ఈ చెన్నకేశవులు, మెడికల్ డైరెక్టర్ కే రజిని, ఉమెన్ వెల్ఫేర్ డైరెక్టర్ జే కల్పన, ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు, అమ్మనబ్రోలు వెంకట సత్యనారాయణ (రిటైర్డ్, ప్రభుత్వ ముద్రణాలయం), అమ్మనబ్రోలు రాంబాబు (రిటైర్డ్, కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్) తదితరులు పాల్గొన్నారు.