న్యాయం చెయ్యండి: జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు

తెలుగు వేవ్ లోగో

తాడేపల్లి: కూతురు కేసు విషయం లో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు వైసీపీ అధినేత వైస్ జగన్ ను కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వైసీపీ కేంద్రకార్యాలయం లో మంగళ వారం కలిశారు. వారు మాట్లాడుతూ 2017 టీడీపీ హయాంలో తమ కుమార్తె ప్రీతి పై దారుణంగా హత్యాచారం చేసి హత్య చేశారన్నారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగ లేదని జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయం లో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందన్నారు. జగన్ హయాం లో కేసును సిబిఐ కి అప్పగిస్తూ జి. ఓ. జారీ చేసిందని, తమ కుటుంబానికి 5 సెంట్ల ఇంటిస్థలం, 5 ఎకరాల ఇంటి స్థలం, రాజు నాయక్ కు వైసీపీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించిన సంగతి గుర్తు చేశారు. ఇవ్వాల్సిన పెన్షన్ ను చంద్రబాబు సర్కార్ నిలిపివేసిందని, సిబిఐ విచారణ పునరుద్దరణ చేయడానికి న్యాయ సాయం చేయాలని కోరారు.

అన్నివిధాలా సాయం చేస్తాం

ప్రీతి తల్లిదండ్రుల ఆవేదన విన్న జగన్ వారికి అవసరమైన న్యాయ సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో వారి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు.

పవన్.. మీకు సబబే నా..

సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాన్ వాడుకున్నారని ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. ప్రీతి కేసు విషయమై అప్పాయింట్మెంట్ అడిగితే డిప్యూటీ సీఎం పవన్ ఇవ్వలేదన్నారు. 2017-19 టీడీపీ హయాంలో సాక్ష్యాలు తారుమారు అయ్యాయి. ఇవ్వని తెలిసికూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట ఇచ్చారాని ప్రశ్నించారు. ప్రీతి విషయంలో దోషులకు శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.