అమరావతి: కేంద్రంలోని మోదీ సర్కార్ గత 10 రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ ధరలను రూ.8 లకుపైగా పెంచిందని, పదే పదే రేట్లు పెంచడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య అన్నారు.
ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుందని తెలిపారు. సోమవారం నాలుగో దఫా పెట్రోల్ పై రూ.2.84, డీజిల్ పై రూ.2.86 పెంచటం దుర్మార్గమని తెలిపారు. విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరలు పెంచేందుకే ప్రజలు ఖర్చులు తగ్గించాలనే మోదీ కుంటి సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
గతంలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించని కేంద్రం, యుద్ధం సాకుతో మరింత పెంచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయా అన్నారు . అలాగే పెట్రో ఉత్పత్తుల ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
