సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని ఆర్.ఆర్.పేట పార్కు ఆందోళన కార్యక్రమం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎక్కడో జరుగుతున్న యుద్ధంతో భారత దేశంలో పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచుతోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచబోమని డాంబికాలు పలికారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం పశ్చిమాసియా దేశాల యుద్ధాలను కారణంగా చూపి పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచిందని విమర్శించారు.
మన రాష్ట్రంలో కాకినాడ కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో 50% మన రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్త రాస్తారోకో కార్యక్రమాలకు సిపిఐ ఇతర వామపక్షాలు పిలుపునిచ్చాయనిప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వారం రోజుల్లో రెండుసార్లు వంట గ్యాస్ ధరను పెంచడమే కాకుండా ఈరోజు మరోసారి వంటగ్యాస్ ధరను పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధంగా పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలను పెంచడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు.
ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రూపాలలో ప్రజలపై అధిక ధరల భారాన్ని వేస్తుందని ఆరోపించారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పశ్చిమాసియా దేశాలలో యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే దేశంలో విపరీతమైన సంక్షోభం ఏర్పడిందని దాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్,కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి,గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు,బాలిన కృష్ణ ప్రసాద్,ఉప్పులూరి లక్ష్మి,కుమార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
