5 రోజుల్లోనే ఖాతాదారులకు డబ్బు వాపస్
డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడిన ఖాతాదారులకు ఊరట కలిగించేలా RBI కొత్త నిబంధనలు విడుదల చేసింది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్గదర్శకాల ప్రకారం, మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా బ్యాంకులు షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో సొమ్మును ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయాలి. బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే పూర్తి బాధ్యత బ్యాంకుదే. థర్డ్ పార్టీ హ్యాకింగ్ ఘటనలను 5 రోజుల్లో నివేదిస్తే ఖాతాదారులకు ఎలాంటి బాధ్యత ఉండదు. అలాగే రూ.500 దాటిన ప్రతి డిజిటల్ లావాదేవీపై ఉచిత ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపడం కూడా బ్యాంకులకు తప్పనిసరి చేసింది.
