AMARAVATHI: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదయ్యాయి. జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు Hi అని మెసేజ్ పంపించి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్ ఫలితాల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
మే 25 నుంచి జూన్ 4వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. 78,261 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.
