బెంగళూరు: భారత స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ మరో చారిత్రాత్మక ఘనతకు అడుగు దూరంలో నిలిచారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో భాగంగా మే 26వ తేదీ గుజరాత్ టైటాన్స్ తో జరిగే క్వాలిఫైయర్ మ్యాచ్లో బరిలో దిగే కోహ్లీ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడుగా నిలవనున్నాడు. ప్రస్తుతం 281 మ్యాచ్ లతో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టాప్ లో ఉన్న కోహ్లీ గుజరాత్ పై బరిలోకి దిగగానే 282 మ్యాచులతో నెంబర్ వన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించమన్నారు.
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేకపోవడంతో హిట్ మాన్ రోహిత్ ఇక ఈ సీజన్లో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. ఇంకోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోని 278 మ్యాచ్ లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అత్యధిక మ్యాచ్ లాడిన ప్లేయర్గా ధోని నిలిచినా గాయం కారణంగా మొత్తం సీజన్ కు దూరం అయ్యాడు. దీంతో విరాట్ ధోనిని అధిగమించాడు. కోహ్లీకి సీజన్లో కనీసం మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. క్వాలిఫైయర్ వన్ లో ఆర్సిబి ఓడినా క్వాలిఫైయర్ టు ద్వారా ఫైనల్ కు చేరితే కోహ్లీ మొత్తం మూడు మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దీంతో అతడి రికార్డు మరింత కాలం ఉంది. ఇప్పటివరకు ఐపీఎల్లో 281 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 9,218 పరుగులతో టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.
