నా భార్య కు ఈడి నోటీసులు అవాస్తవం:ఎంపీ చిన్ని క్లారిటీ

Kesineni Chinni

ఒక గృహిణి పై తప్పుడు ఆరోపణలు సరికాదు

ఆర్కిటెక్ట్ ఫీజు మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు

నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని వివరణ

విజయవాడ: విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఈడి నోటీసులపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్యకు ఈడి నోటీసులు ఇవ్వడం అవాస్తవమని స్పష్టం చేశారు. నోటీసులు వచ్చింది కేశినేని డెవలపర్స్ కు మాత్రమేనని స్పష్టం చేశారు ఈనెల 27న కంపెనీ ప్రతినిధులు విచారణ అధికారులు ఎదుట హాజరై పూర్తి వివరణ ఇస్తారని వెల్లడించారు. వ్యాపార లావాదేవీ కి సంబంధించిన వివరణ కోరుతూనే ఈడి నోటీసులు పంపిందని చిన్ని తెలిపారు.

రాజ్ కేసిరెడ్డికి చెందిన ఇశ్వాని సంస్థ తో కలిసి తాము ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ సంస్థ ద్వారా కేవలం 35 లక్షలు మాత్రమే లావాదేవీలు జరిగాయని అన్నారు. రాజ్ కేసిరెడ్డి సంగతి తెలిసిన వెంటనే 2022లోనే తామ సంస్థ నుంచి పూర్తిగా బయటికి వచ్చినట్లు చిన్ని వివరించారు. తాము జరిపిన ఆ లావాదేవీ కేవలం ఆర్కిటెక్ట్ ఫీజు మాత్రమేనని అంతకుమించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని విషయాన్ని ఈడికి ఇచ్చే వివరణలో స్పష్టంగా చెబుతామని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.

మద్యం స్కామ్ లో తన భార్యకు ఈడి నోటీసులు ఇచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మీడియా ముఖంగా ఖండించారు. గతంలో పెట్టిన ఆ కంపెనీలో తన భార్య కేవలం ఒక డైరెక్టర్గా మాత్రమే ఉన్నారని ఈడి నోటీసులు పంపింది కేవలం సదరు కంపెనీకేనని తన భార్యకు ఎలాంటి వ్యక్తిగత నోటీసులు రాలేదని ఎంపీ చిన్ని అన్నారు. వైసిపి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు దీటుగా స్పందిస్తున్న అందుకే తనపై ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ చిన్ని అన్నారు ఒక గృహిణిపై ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేశారు.